పవన్ “వీరమల్లు” అదిరే ఫీస్ట్ అప్పుడేనట.?

Published on May 22, 2021 1:02 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో ప్లాన్ చేసిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “హరి హర వీరమల్లు” కూడా ఒకటి. దీనిపై ఒక రేంజ్ లో అంచనాలు కూడా ఉన్నాయి. మరి అందుకు తగ్గట్టుగానే క్రిష్ ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్టుగా ఆ మధ్య వచ్చిన టైటిల్ గ్లింప్స్ చూసాక అందరికీ క్లియర్ అయ్యింది.

ఇక దీనిని మించిన అదిరే ఫీస్ట్ కు సమయం కుదిరేలా ఉందని ఇపుడు నయా టాక్ స్ప్రెడ్ అవుతుంది. అదే ఈ చిత్రం టీజర్ కోసం.. ఈ సినిమా అద్భుత టీజర్ కట్ ను వచ్చే సెప్టెంబర్ 2 న పవన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారని ఇపుడు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :