“ఆచార్య” నుంచి ఈ అప్డేట్ కి టైం అయ్యిందా.?

Published on Jun 1, 2021 9:00 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే హై బడ్జెట్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో మెగా తనయుడు మెగాపవర్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్ర చేస్తున్నాడు. మరి కొన్ని రోజుల కొరటాల శివ ఈ చిత్రంపై పలు ఆసక్తికర విషయాలను ఎలక్ట్రానిక్ మీడియాతో పంచుకున్నారు. అలాగే ఈ చిత్రం నుంచి మరో మోస్ట్ అవైటెడ్ సాంగ్ సెకండ్ సింగిల్ పై కూడా క్లారిటీ ఇచ్చారు.

అయితే అది రావడానికి టైం దగ్గర పడుతున్నట్టే టాక్ వినిపిస్తుంది. కోవిడ్ పరిస్థితులు కాస్త మెరుగు పడ్డాక ఆ సాంగ్ ని విడుదల చేస్తామని కొరటాల అప్పుడు క్లారిటీ ఇచ్చారు. మరి బహుశా అది ఈ నెలలోనే విడుదల కావచ్చని నయా టాక్.. అయితే ఈ బ్యూటిఫుల్ రొమాంటిక్ నెంబర్ కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :