బాలీవుడ్ సెన్సేషనల్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ (Dhurandhar) బాక్సాఫీస్ వద్ద, ఓటీటీలో సృష్టించిన ప్రభంజనం తర్వాత, ఇప్పుడు దాని సీక్వెల్ ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర టీజర్‌ను నేడు మధ్యాహ్నం 12:12 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్, రణవీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, ఆర్. మాధవన్ వంటి భారీ తారాగణంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.
ఈ చిత్ర మ్యూజిక్ రైట్స్‌ను సారెగామ నుంచి టీ-సిరీస్ సంస్థ భారీ ధరకు దక్కించుకుంది. టీజర్ కూడా టీ-సిరీస్ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లోనే లాంచ్ కానుంది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషిస్తుండగా, సారా అర్జున్ ఒక సర్ప్రైజ్ రోల్‌లో కనిపించనుంది.
జియో స్టూడియోస్ మరియు B62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం మార్చి 19, 2026న పాన్-ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) టీజర్ అనౌన్స్‌మెంట్ ట్రెండ్ అవుతుంది.
Ab Bigadne Ka Waqt Aa Gaya Hai.
Dhurandhar: The Revenge
Teaser Out Today at 12:12 PM#DhurandharTheRevenge Releasing In Cinemas Worldwide on 19th March 2026 in Hindi, Telugu, Tamil, Kannada & Malayalam.#AkshayeKhanna @duttsanjay @ActorMadhavan @rampalarjun #SaraArjun… pic.twitter.com/KT8QHkwCMB— Ranveer Singh (@RanveerOfficial) February 3, 2026


