‘హరిహర వీరమల్లు’ సెకండ్ సాంగ్ ప్రోమోకు టైమ్ ఫిక్స్

‘హరిహర వీరమల్లు’ సెకండ్ సాంగ్ ప్రోమోకు టైమ్ ఫిక్స్

Published on Feb 20, 2025 10:09 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తుండగా స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు. హిస్టారికల్ చిత్రంగా రానున్న ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే పోస్టర్స్, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాయి. ఈ మూవీలోని సెకండ్ సింగిల్ సాంగ్‌గా ‘కొల్లగొట్టినాదిరో’ పాటను ఫిబ్రవరి 24న సాయంత్రం 3 గంటలకు రిలీజ్ చేయనున్నారు. అయితే, ఇప్పుడు ఈ పాటకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రెడీ చేశారు.

ఈ సాంగ్ ప్రోమోను ఫిబ్రవరి 21న మధ్యాహ్నం 1.20 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మార్చి 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు