మెగాస్టార్ చిరంజీవి తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాను అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి ఈ మూవీపై అంచనాలు క్రియేట్ అయ్యాయి. చిరంజీవి కోసం అనిల్ రావిపూడి ఎలాంటి కథతో వస్తాడా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే, ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ మెగా అనౌన్స్‌మెంట్ రానుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని మేకర్స్ మే 17న ఉదయం 11.07 గంటలకు రివీల్ చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో మెగా 157 చిత్రంలో చిరు సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది ఎవరా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమాను అనిల్ రావిపూడి తనదైన మార్క్ చిత్రంగా రూపొందించనున్నాడు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేస్తున్నారు.


