‘తమ్ముడు’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. ఎప్పుడు వస్తుందంటే..?

‘తమ్ముడు’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. ఎప్పుడు వస్తుందంటే..?

Published on Jun 10, 2025 8:54 PM IST

హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు మేకర్స్.

ఇందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను జూన్ 11న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమాలో నితిన్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, శ్వాసిక, లయ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా, జూలై 4న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు