‘జైలర్ 2’ బిగ్ అప్డేట్ కి టైం లాక్ చేసిన మేకర్స్!

‘జైలర్ 2’ బిగ్ అప్డేట్ కి టైం లాక్ చేసిన మేకర్స్!

Published on Jul 2, 2026 12:01 PM IST

Jailer2

తెలుగు సహా తమిళ్ ఆడియెన్స్ కూడా ఓ రేంజ్ లో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ సీక్వెల్ సినిమానే “జైలర్ 2”. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రం జైలర్ కి సీక్వెల్ గా పార్ట్ 2 ని మేకర్స్ రెడీ చేశారు. అయితే షూట్ ఎపుడో పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల కోసం మాత్రం ఫ్యాన్స్ అంతా ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

ఇక ఫైనల్ గా అందుకు మేకర్స్ సమయం ఫిక్స్ చేశారు. ఈ జూలై 2 సాయంత్రం ఆ బిగ్ అప్డేట్ ని రివీల్ చేస్తున్నట్టుగా తలైవర్ పై ఓ క్రేజీ పోస్ట్ తో ఖరారు చేశారు. సో జైలర్ 2 రిలీజ్ ఎప్పుడు అనేది ఈ సాయంత్రం క్లారిటీ వచ్చేస్తుంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా శివ రాజ్ కుమార్, మోహన్ లాల్ తో పాటుగా మరింతమంది బిగ్ స్టార్స్ సినిమాలో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రానికి సన్ పిక్చర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు