96 తెలుగు రీమేక్ కు టైటిల్ ఫిక్స్ !

Published on Mar 6, 2019 10:45 am IST

కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ’96’ తెలుగులో రీమేక్ కానుంది. యంగ్ హీరో శర్వానంద్ , సమంత జంటగా నటించనున్న ఈ చిత్రాన్ని ప్రేమ్ కుమార్ తెరకెక్కించనున్నాడు. కాగా ఒరిజినల్ వెర్షన్ కు కూడా ఆయనే దర్శకత్వం వహించాడు. తెలుగులో ప్రేమ్ కు ఇదే మొదటి సినిమా. ఇక ఈ చిత్రానికి ‘జాను’ అనే టైటిల్ ను ఖరారు చేశారని సమాచారం. ఫిలిం ఛాంబర్ లో ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించారట నిర్మాత దిల్ రాజు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ప్యూర్ ఎమోషనల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతం అందించనున్నాడు. మొదటి సారి శర్వా -సమంత జంటగా నటించనుండడం అలాగే దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మిస్తుండడంతో ఈ సినిమా ఫై మంచి అంచనాలు వున్నాయి.

ఇక ఒరిజినల్ వెర్షన్ లో విజయ్ సేతుపతి ,త్రిష జంటగా నటించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొంది పలు అవార్డులను సొంతం చేసుకుంది. మరి ఈ రీమేక్ కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

More