విజయ్ దేవరకొండ కొత్త చిత్రానికి టైటిల్ ఖరారు !
Published on Jun 20, 2018 3:16 pm IST

హీరో విజయ్ దేవరకొండ పరుశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడని తెలిసేందే. ఈ చిత్రానికి ‘గీత గోవిందం’ అనే టైటిల్ ను ఖరారు చేశారు చిత్ర యూనిట్. రష్మిక కథనాయికగా నటిస్తున్న ఈ సినిమాని గీతా ఆర్ట్స్-2 పతాకం ఫై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రానికి సమర్పికుడిగా వ్యవహరిస్తున్నారు.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్ర ప్రీ లుక్ పోస్టర్ ను రేపు విడుదల చేయనున్నారు. ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా విజయం తరువాత పరుశురాం తెరెకెక్కించనున్న ఈ చిత్రం ఫై మంచి అంచనాలు ఉన్నాయి .

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook