నాని -సుధీర్ బాబు ల మల్టీస్టారర్ కు టైటిల్ ఫిక్స్ !

Published on Apr 8, 2019 4:18 pm IST

అష్టా చమ్మ , జెంటిల్ మన్ ఫేమ్మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని , సుధీర్ బాబు కలిసి ఓ మల్టీ స్టారర్ చిత్రం లో నటించనున్నారని తెలిసిందే. ఇక ఈ చిత్రానికి ‘వ్యూహం’ అనే టైటిల్ ను ఖరారు చేయనున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే తాజాగా అదే టైటిల్ ను ఈ సినిమా ఫిక్స్ చేశారని సమాచారం. దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే లాంచ్ కానుంది.

ఇక మోహన్ కృష్ణ తో నాని కి ఇది మూడవ సినిమా కాగా సుధీర్ బాబు కి రెండవది. మరి తన గత చిత్రాలతో ఈ హీరోలకు హిట్లు ఇచ్చిన ఈ దర్శకుడు ఈ వ్యూహం తో కూడా మరో హిట్ ఇస్తాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :