తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా ‘సలీం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ దర్శకత్వంలో ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ జంటగా ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రానికి ‘మిస్ మ్యాచ్’ టైటిల్ పెట్టింది. ఈ విషయాన్ని చిత్రబృందం తమ సామాజిక మాధ్యమం ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించారు.
ఇక ఈ చిత్రాన్ని ‘అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి. సంస్థ పై జి.శ్రీరామ్ రాజు- కె.భరత్ రామ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రీడల నేపథ్యంలో సాగే వినోదభరితమైన కుటుంబ కధా చిత్రమిదని తెలుస్తోంది. ఈ చిత్రం ఈ నెల జరిగే చివరి షెడ్యూల్ తో ఈ చిత్రం షూటింగ్ పూర్తవుతుంది.


