తెరి రీమేక్ కి టైటిల్ ఫిక్స్ ?

Published on Mar 15, 2019 12:08 am IST

‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ ,మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్ లో సూపర్ హిట్ కోలీవుడ్ మూవీ తెరి కి రీమేక్ తెరకెక్కనుందని తెలిసిందే. అయితే ఒరిజినల్ వెర్షన్ లో మాదిరి సీన్ తో సీన్ కాపీ చేయకుండా స్క్రిప్ట్ లో చాలా చేంజెస్ చేశాడట సంతోష్. ఈచిత్రంలో రవితేజ పవర్ ఫుల్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఏప్రిల్ 15నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇక ఈ చిత్రానికి కనకదుర్గ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని టాక్. అయితే ఈ టైటిల్ ఫై అధికారిక సమాచారం వెలుబడాల్సి వుంది. ఇక ఇదిలా ఉంటే రవితేజ ప్రస్తుతం వి ఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కోరాజా అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు కూడా ఈ ఏడాదిలోనే విడుదలకానున్నాయి

సంబంధిత సమాచారం :

More