త్రిష కొత్త సినిమా కు టైటిల్ ఫిక్స్ !

Published on Apr 20, 2019 10:50 am IST

గత ఏడాది 96 చిత్రం తో సూపర్ హిట్ కొట్టిన సీనియర్ హీరోయిన్ త్రిష ఆ తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ ,పేట లో నటించింది. ఇక ఈ చిత్రం తరువాత కొంచెం బ్రేక్ తీసుకొని త్రిష ఇటీవల ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ ఏ ఆర్ మురగదాస్ స్టోరీ అందిస్తున్న ఈ చిత్రాన్ని శరవణన్ తెరకెక్కించనున్నాడు.

ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో నిన్న లాంఛ్ అయ్యింది. టాప్ ప్రొడక్షన్ హౌజ్ లైకా ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రానికి ‘రాంగి’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. అయితే త్రిష సోలోగా లీడ్ రోల్ లో నటించిన చిత్రాల్లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. మరి ఈచిత్రం ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :