మహేష్ – మురుగదాస్ ల సినిమా టైటిల్ రిజిస్టర్ చేయించారు !

2nd, April 2017 - 01:41:16 PM


గత కొన్నాళ్లుగా మహేష్, మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రానికి సంబందించిన టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ వంటి వివరాలు ఒక్కటి కూడా బయటకు తెలియకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురై తమ అసహన్నాన్ని బయటపెట్టారు. దీంతో మహేష్ ఇంకాస్త ఓపికపట్టండంటూ పర్సనల్ గా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అయితే తాజాగా ఫిల్మ్ నగర్లో మహేష్ ఫ్యాన్స్ కోసం ఒక శుభవారట తెగ చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే మహేష్-మురుగదాస్ ల సినిమాకు ‘స్పైడర్’ అనే పేరును ఖరారు చేశారట. పైగా ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాత ఎన్వీ ప్రసాద్ యొక్క ఎన్వీఆర్ సినిమా బ్యానర్ పై ‘స్పైడర్’ అనే టైటిల్ రిజిస్టర్ చేసి ఉందట. ఈ పరిణామాలన్నింటినీ బట్టి చూస్తే మహేష్ 23వ చిత్రానికి ‘స్పైడర్’ అనే టైటిల్ దాదాపు ఖరారైనట్టేనని అనిపిస్తోంది. దాంతో పాటే మహేష్, మురుగదాస్ ల నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు కాస్త వెయిట్ చేయాల్సిందే అనే ఆలోచన కూడా వస్తోంది.