‘పంజా’ సినిమాలో విలన్ గా నటించిన అడవి శేష్ ను హీరోగా ‘కిస్’ అనే సినిమాలో చూడనున్నాం. కీప్ ఇట్ స్మైల్ స్టుపిడ్ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. ‘కర్మ’ సినిమా తరువాత శేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సాయికిరణ్ అడవి నిర్మాత. ప్రియా బెనర్జీ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఈ రోజు టైటిల్ ట్రాక్ ఇంటర్నెట్లో విడుదల చేయగా అది యువతను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా గురించి శేష్ మాట్లాడుతూ “మేము విడుదల చేసిన పాట సినిమా నేపధ్యాన్ని తెలియజేస్తుంది. ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కోగల సామాన్యమైన వ్యక్తిగా కనిపించానున్నాను. ఇందులో ఒక మంచి సిద్దాంతాన్ని కుడా జతపరిచాము. ఈ సినిమా టైటిల్ హీరొయిన్ పాత్ర కోసమే పెట్టాము. ఆమె మొదటి కిస్ తన జీవితాన్ని ఎలా మార్చింది అనేది ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కధ “అని తెలిపారు. సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని జూన్ లో ఆడియో విడుదలకు సిద్దమవుతుంది. శ్రీచరణ్ సంగీతం అందించాడు.
ఉర్రూతలూగిస్తున్న కిస్ టైటిల్ సాంగ్
ఉర్రూతలూగిస్తున్న కిస్ టైటిల్ సాంగ్
Published on May 17, 2013 3:10 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : ‘టాక్సిక్’ – స్టైల్ ఉన్నా.. సోల్ లేని పీరియాడిక్ డ్రామా!
- ‘ప్యారడైజ్’ మ్యాడ్నెస్ నెక్స్ట్ లెవెల్లో ఉండాల్సిందే..!
- రవితేజ సినిమాకు టైటిల్ మార్చారా..?
- ‘ఫౌజీ’లో ప్రభాస్‌ను చూసి షాక్ అవ్వాల్సిందే – నిర్మాత రవి శంకర్
- నాగార్జున కూడా ఆ రేస్‌లోనే దిగుతాడా..?
- ‘కాంతార’ను డామినేట్ చేసిన ‘టాక్సిక్’
- రికార్డులు తిరగరాస్తున్న మరో మలయాళ మూవీ
- ‘విశ్వంభర’లో తిరిగి జాయిన్ అయిన మెగాస్టార్..!
- హిందీలో ‘టాక్సిక్’ ర్యాంపేజ్.. ఓపెనింగ్స్ ఏకంగా రూ.50 కోట్లకు పైగా..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ‘టాక్సిక్’ – స్టైల్ ఉన్నా.. సోల్ లేని పీరియాడిక్ డ్రామా!
- టాక్సిక్ : స్పెషల్ ప్రీమియర్ షోలకు అనుమతి.. అక్కడ టికెట్ రేటు ఎంతంటే..?
- ‘ఇరుముడి’ బాక్సాఫీస్ రికార్డులు: 4 రోజుల్లోనే 38 లక్షల టికెట్లు.. రూ.100 కోట్ల క్లబ్, ‘బాహుబలి 2’ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఆక్యుపెన్సీ
- ‘ఇరుముడి’పై రష్మిక ఎమోషనల్ పోస్ట్.. చెప్పుకోలేనిది చెప్పారు!
- స్వామి శరణం: నైజాంలో “ఇరుముడి” సెన్సేషన్.. వర్కింగ్ డేలో కూడా ట్రేడ్ షాకయ్యే వసూళ్లు!
- రేపే ‘టాక్సిక్’ విడుదల: ఏపీ, తెలంగాణల్లో మొదలైన బుకింగ్స్.. తొలి షో ఎప్పుడంటే?
- కొన్ని గంటలే ఉన్నా తెరుచుకోని ‘టాక్సిక్’ తెలుగు బుకింగ్స్!
- ‘ఇరుముడి’కి టాక్సిక్ డేంజర్ బెల్స్.. సగానికి పైగా లాగేస్తుందా..?


