బ్రేకింగ్ :కరోనాతో ‘టీఎన్‌ఆర్‌’ మృతి !

Published on May 10, 2021 11:02 am IST

ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్‌ఆర్‌ కరోనా మహమ్మారితో కన్నుమూశారు. ఈ రోజు ఉదయం కాచిగూడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఆయన కరోనా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి ఆదివారం కోమాలోకి వెళ్లారు. వెంటిలేటర్‌ పై చికిత్స అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. టీఎన్‌ఆర్‌ జర్నలిస్ట్ గానే కాకుండా నటుడిగా కూడా మంచి గుర్తింపు పొందారు. ఆయన త్వరలో దర్శకత్వం కూడా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలో ఇలా జరగడం బాధాకరమైన విషయం.

కాగా టీఎన్‌ఆర్‌ వైద్యానికి కోలుకుంటున్నట్లు కనిపించినప్పటికీ, చివరకు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన ఇంటర్వ్యూలో పాల్గొనడానికి ప్రముఖులు సైతం ఇంట్రెస్ట్ చూపించేవారు. సినీ మరియు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయన మృతి పట్ల తమ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు. ‘123తెలుగు.కామ్’ నుండి టీఎన్‌ఆర్‌ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాము.

సంబంధిత సమాచారం :