ఈరోజే “కేజీయఫ్ 2” రిలీజ్..కొత్త రిలీజ్ డేట్ పై ఆసక్తి.!

Published on Jul 16, 2021 9:00 am IST


“బాహుబలి” సిరీస్ తర్వాత ఇండియన్ సినిమా దగ్గర ప్రతీ భాషలో కూడా యూనానిమస్ హిట్ కాబడిన చిత్రం ఏదన్నా ఉంది అంటే అది కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి హీరోయిన్ గా నటించిన “కేజీయఫ్” సినిమానే అని చెప్పాలి. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం ఓవర్ హైప్ తో వస్తుంది అనే టాక్ తోనే అన్ని వర్గాల ఆడియెన్స్ కూడా బంపర్ హిట్ చేశారు.

అందుకే ఇప్పుడు రానున్న ‘చాప్టర్ 2’ పై భారీ హైప్ నెలకొంది. అసలు అన్ని భాషల్లో కూడా కనీ వినీ ఎరుగని రీతి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ భారీ పాన్ ఇండియన్ సినిమా రిలీజ్ ఈరోజే.. అదే ఈరోజు జూలై 16 కదా మేకర్స్ ఎప్పుడో అనౌన్స్ చేసిన డేట్ ఇది.. ఒకవేళ అన్నీ కరెక్ట్ గా ఉంటే ఈ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ని ఈరోజు థియేటర్స్ లో విట్నెస్ చేసి ఎంజాయ్ చేసి ఉండే వాళ్ళం.

కానీ కరోనా వల్ల అవన్నీ దూరం అయ్యిపోయాయ్.. అయితే ఈరోజే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అవుతుంది అని స్ట్రాంగ్ బజ్ కూడా ఉంది. మరి ఇదే రిలీజ్ డేట్ రోజు కొత్త రిలీజ్ డేట్ వస్తుందో లేదో అన్నది ఆసక్తిగా మారింది.

సంబంధిత సమాచారం :