2027 సంక్రాంతి: సీనియర్ హీరోలు అందరూ కన్నేసిన సంక్రాంతి.. అప్పుడే హీట్ మొదలు

2027 సంక్రాంతి: సీనియర్ హీరోలు అందరూ కన్నేసిన సంక్రాంతి.. అప్పుడే హీట్ మొదలు

Published on Feb 8, 2026 9:00 PM IST

Tollywood

మన తెలుగు సినిమా దగ్గర బిగ్గెస్ట్ ఫెస్టివల్ సీజన్ ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా సంక్రాంతి సీజన్ అనే చెప్పాలి. ఈ సీజన్ లో క్లిక్ అయితే చాలు ఎన్ని సినిమాలు ఉన్నా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అలా ఈ ఏడాది సంక్రాంతి సీజన్ సినిమాలు రన్ ముగించుకుంటున్న సమయంలో అప్పుడే 2027 సంక్రాంతి హీట్ కూడా మొదలై పోయింది.

అయితే 2027 సంక్రాంతి మాత్రం ఇన్నేళ్ల సినీ చరిత్రలో ఎంతో ప్రత్యేకం అని చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే మన టాలీవుడ్ టాప్ స్టార్ హీరోస్ మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ అలాగే నటసింహం బాలకృష్ణ ఇంకా కింగ్ అక్కినేని నాగార్జునలు తమ సినిమాలతో రాబోతున్నారు.

బాలయ్య, గోపిచంద్ మలినేని ప్రాజెక్ట్, వెంకీ మామ, అనీల్ రావిపూడి ఎంటర్టైనర్ అలాగే చిరు బాబీ సినిమా కూడా అప్పుడుకే టార్గెట్ చేస్తుండగా ఈ రేస్ లో అక్కినేని నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన ఫ్రాంచైజ్ తో వస్తున్న వార్ డిక్లేర్ చేశారు. దీనితో మన సీనియర్ హీరోస్ అందరిదీ ఈ రానున్న సంక్రాంతి అని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఈ అన్ని సినిమాలు అప్పటికే టార్గెట్ పెట్టుకున్నాయి. మరి అప్పటికి పరిస్థితిలు ఏమన్నా మారి ఎవరైనా తప్పుకుంటారా లేక అందరూ వస్తారా అనేది వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు