‘బాహుబలి’ ఫస్ట్ బెనిఫిట్ షోకి రానున్న టాలీవుడ్ స్టార్స్

‘బాహుబలి’ ఫస్ట్ బెనిఫిట్ షోకి రానున్న టాలీవుడ్ స్టార్స్

Published on Jul 8, 2015 11:55 PM IST

baahubali
ఇండియాలో మొట్ట మొదటి సారిగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మొదటి మోషన్ పిక్చర్ ‘బాహుబలి’. బడ్జట్ లోనే కాదు విజువల్స్ పరంగా కూడా హాలీవుడ్ కి దీటుగా నిలిచేలా ఉండనున్న ఈ సినిమా జూలై 10న ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ కి ఇంకా 2 రోజులు ఉంది. దాంతో సినీ అభిమానులంతా థియేటర్స్ దగ్గర బారులు తీరారు. ఇదిలా ఉంటే మేజర్ సిటీలలో అర్ధరాత్రి నుంచే బాహుబలి సినిమా బెనిఫిట్ షోస్ ప్రారంభం కానున్నాయి. ఆ సినిమా టికెట్స్ కి కూడా భారీగా క్రేజ్ ఉంది.

మన భాగ్యనగరంలో వేయబోయే బెనిఫిట్ షో విషయానికి వస్తే.. రెండు ట్విన్ సిటీస్ లకి గాను మొదటిగా మూసాపేట్ లోని శ్రీరాములు థియేటర్ లో వేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా బెసిఫిట్ షోకి సంబందించిన టికెట్స్ జోరుగా అమ్ముడు పోతున్నాయి. ఇదిలా ఉంటే శ్రీరాములు థియేటర్ లో పడనున్న మొదటి షోకి ఇండస్ట్రీలోని పలువురు స్టార్స్, పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం సునీల్, నాగ శౌర్య, దిల్ రాజు ఫ్యామిలీ మెంబర్స్ హాజరు కానున్నారు. వీరితో పాటు చాలా మంది ప్రముఖులే హాజరు కానున్నారు.

బాహుబలికి గట్టి పోటీని ఇచ్చే భళ్లాలదేవ పాత్రలో రానా దగ్గుబాటి కనిపించనున్నాడు. తమన్నా, అనుష్క ప్రధాన పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు