హిట్ కోసం ఫైట్ చే..స్తూ..నే ఉన్న హీరోలు !

Published on Jan 24, 2019 12:00 pm IST

సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ కంటే.. సక్సెస్ కే స్టార్ డమ్ ఎక్కువ. హీరో హీరోయిన్ అయినా, కమెడియన్ అయినా హిట్ ఉంటేనే వాళ్ళకంటూ ఒక వాల్యూ..! లేకపోతే వాళ్ళని సినిమా వాళ్ళతో పాటు ఆడియన్స్ కూడా పట్టించుకోరు. అందుకే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ హిట్ గురించే ఆలోచిస్తారు. అందులో హీరోలు అయితే మరీనూ..!

ఒకప్పుడు హిట్లు అందుకుని.. చాలా కాలం నుంచి హిట్ కోసం ఫైట్ చేస్తూ.. హిట్ కొట్టలేక.. బాక్సాఫీస్ వద్ద పడిగాపులు కాస్తోన్న హీరోలు టాలీవుడ్ లో చాలామందే ఉన్నారు. రవితేజ, గోపీచంద్, కళ్యాణ్ రామ్, నితిన్, రాజ్ కిరణ్, సందీప్ కిషన్, నాగచైతన్య, అఖిల్, నారా రోహిత్, సాయి ధరమ్ తేజ్, అల్లరి నరేష్ ఇలా చెప్పుకుంటూ పోతే.. లిస్ట్ పెద్దదే వస్తోంది. ఇప్పుడు వీరందరి కెరీర్ ఒక హిట్ తప్పనిసరి.

వీళ్ళలో ముందుగా చెప్పుకోవాల్సిన హీరో ‘సాయి ధరమ్ తేజ్’. ఇండస్ట్రీలోకి ఈ మెగా మేనల్లుడు మొత్తానికి హిట్ మూవీతోనే ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత ‘రేయ్’ అనే ఒక్క సినిమా తప్ప వరుస విజయాలు అందుకున్నాడు తేజ్. కానీ ప్రస్తుతం ప్లాప్ ల పరంపరలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఎప్పుడో 2015లో వ‌చ్చిన ‘సుప్రీమ్’ త‌ర్వాత చేసిన ‘తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటిలిజెంట్, తేజ్ ఐ లవ్ యు’ ఇలా సినిమాలన్నీ భారీ డిజాస్టర్‌లే. పాపం ఎప్పటినుంచో తేజ్ హిట్ కోసం హీట్ ఎక్కేలా ఫైట్ చే..స్తూ..నే ఉన్నాడు. ప్రస్తుతం చేస్తోన్న ‘చిత్రల‌హరి’ ఫలితం బట్టే.. బాక్సాఫీస్ వద్ద ‘సాయి ధరమ్ తేజ్’ రేంజ్ కూడా ఆధారపడి ఉంటుంది.

మరో హీరో కళ్యాణ్ రామ్ విషయానికి వస్తే.. 2009లో వచ్చిన జయీభవ దగ్గరనుంచి మధ్యలో ఒక్క ‘పటాస్’ తప్ప.. కత్తి, ఓమ్ 3డి, ‘షేర్, ఇజం, ‘ఎమ్ ఎల్ ఏ’, నా నువ్వే’, చివరకి మొన్న వచ్చిన ‘కథానాయకుడు’తో సహా వరుస పరాజయాలను ఎదురుకుంటూనే ఉన్నాడు. పాపం సంవత్సరాలుగా కళ్యాణ్ రామ్ కూడా హిట్ కోసం తీవ్రమైన ఫైట్ చే..స్తూ..నే ఉన్నాడు.

ఇక రవితేజ గురించి చెప్పుకుంటే మధ్యలో ‘రాజా ది గ్రేట్’ తప్ప ఆ సినిమాకి ముందు చేసిన బెంగాల్ టైగర్, కిక్ 2, సినిమాలు కావొచ్చు , ఆ సినిమా తరువాత చేసిన ‘టచ్ చేసి చూడు’, ‘నేల టిక్కెట్టు’, ‘అమర్ అక్బర్ ఆంటోని’ లాంటి సినిమాలు కావొచ్చు. అన్ని భారీ ప్లాప్ లే. ప్రస్తుతం రవితేజ కూడా హిట్ కోసం ఫైట్ చే..స్తూ..నే ఉన్నాడు.

ఇక ప్రముఖంగా చెప్పుకోవాల్సిన మరో పేరు ‘అల్లరి నరేష్’. ఎప్పుడో 2012లో చేసిన ‘సుడిగాడు’ అనే పేరడీ సినిమా తర్వాత అల్లరి నరేష్ చేసిన సినిమాలన్నీ అత్యంత భారీ డిజాస్టర్‌లే. ఒక్కప్పుడు తోటి హీరోలు అసూయ పడేలా వరుసగా హిట్స్ మీద హిట్స్ కొట్టిన అల్లరోడు.. ప్రస్తుతం హిట్ కోసం పాపం ఫైట్ చే..స్తూ..నే ఉన్నాడు.

ఇక ‘గుండెజారి గల్లంతయ్యిందే’ అనే సినిమాకి ముందు వరకు టాలీవుడ్ లో ప్లాప్ హీరోకి పర్యాయ పదంగా మారిపోయిన నితిన్.. ఎట్టకేలకూ ఆ ప్లాప్ ల వలయంలో నుంచి బయటపడ్డాడు. మళ్లీ మినిమమ్ గ్యారింటీ హీరోగా చలామణి అవుతున్న టైంలో.. ‘లై’, ‘చల్ మోహన్ రంగా’, ‘శ్రీనివాస కళ్యాణం’లాంటి ప్లాప్ లతో మళ్లీ నితిన్ డీలా పడ్డాడు. ప్రస్తుతం నితిన్ కూడా సరైన హిట్ కోసం ఫైట్ చే..స్తూ..నే ఉన్నాడు.

అక్కినేని యంగ్ హీరో అఖిల్ చేసిన మొదటి రెండు సినిమాలు అఖిల్ కి స్టార్ డమ్ ని తెచ్చి పెట్టలేకపోయాయి. ప్రస్తుతం మిస్టర్ మజ్నుతో ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నాడు అఖిల్. కనీసం మజ్ను అయినా అఖిల్ బ్లాక్ బ్లస్టర్ కలను నెరవేస్తుందో లేక.. అఖిల్ కూడా మళ్లీ హిట్ కోసం ఫైట్ చే..స్తూ..నే ఉండేలా చేస్తుందో చూడాలి.

యాక్షన్ హీరో గోపీచంద్‌ కి ఈ మధ్య ప్లాప్ లు తప్ప హిట్లు అస్సలు రాను అంటున్నాయి. అప్పుడెప్పుడో చేసిన ‘లౌక్యం’ సినిమా తప్ప.. ఈ మధ్యకాలంలో గోపీచంద్ కి సరైన హిట్ రాలేదు. భారీ హిట్ కోసం ఈ యాక్షన్ హీరో కూడా సరైన హిట్ కోసం ఫైట్ చే..స్తూ..నే ఉన్నాడు.

ఇక నాగచైతన్య విషయానికి వస్తే.. ‘శైలజారెడ్డి అల్లుడు’, ‘స‌వ్య‌సాచి’ పరాజయాలు పాలవ్వడంతో బాక్సాఫీస్ వద్ద చైతు మార్కెట్ కాస్త డల్ అయింది. శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తోన్న సినిమా భారీ హిట్ అవ్వాలని ప్రస్తుతం చైతు కూడా ఫైట్ చే..స్తూ..నే ఉన్నాడు.

ఇక చివరగా యంగ్ హీరోలు రాజ్ తరుణ్, సందీప్ కిషన్, నిఖిల్, నారా రోహిత్, నాగ శౌర్య, అల్లు శిరీష్, శ్రీ విష్ణు ఇలా చాలామంది హీరోలూ బాక్సాఫీస్ వద్ద నిలబడటానికి మంచి హిట్ కోసం తీవ్రంగా ఫైట్ చే..స్తూ..నే ఉన్నారు. మ‌రి ఈ హీరోలు ఫైట్ కి హిట్ వస్తుందో.. లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More