మరో ఎంట్రీతో మరింత హీటెక్కిన “మా” ఎన్నికలు.!

Published on Jun 23, 2021 7:03 am IST

ప్రతిసారి లానే ఈసారి కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో “మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్”(మా) ఎన్నికలకు రంగం సిద్ధం అయ్యింది. అయితే మరి ఈసారి ఇంతకు ముందు కంటే కూడా ఎన్నికలు మరింత రసవత్తరంగా మారనున్నట్టు అర్ధం అయ్యింది. ఓ పక్క సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ పోటీ చేయనుండగా మరోపక్క మంచు వారి హీరో మంచు విష్ణు కూడా పోటీగా బరిలో దిగడంతో మాంచి హీట్ స్టార్ట్ అయ్యింది.

మరి ఇప్పుడు ఈ పోటీని మరింత ఆసక్తిగా మారుస్తూ అదే ప్రెసిడెంట్ పోస్ట్ కు జీవిత రాజశేఖర్ పేరు కూడా రేస్ లోకి రావడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ పోస్ట్ కి గాను ప్రకాష్ రాజ్, విష్ణు సహా జీవిత కూడా రేస్ లోకి వచ్చారు. మరి వీరి ముగ్గిరిలో ఈసారి ఎవరు కొత్త ప్రెసిడెంట్ గా అవతరిస్తారో చూడాలి. ఇప్పటికే గత ఎన్నికల్లో ఏ స్థాయి రసాభాస జరిగిందో తెలిసిందే..

సంబంధిత సమాచారం :