కొత్త ఫిల్మ్ మేకర్స్ కి కేరాఫ్ అడ్రస్ టాలీవుడ్

కొత్త ఫిల్మ్ మేకర్స్ కి కేరాఫ్ అడ్రస్ టాలీవుడ్

Published on Feb 16, 2013 8:00 AM IST

telugu-cinema-logo

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త ఫిల్మ్ మేకర్స్ కి ఇదొక సూపర్బ్ టైం. గత కొన్ని సంవంత్సరాల్లో చాలా మంది కొత్త ఫిల్మ్ మేకర్స్ వచ్చారు. డిజిటల్ ఫిల్మ్ టెక్నాలజీ వల్ల చాలా కొత్త సినిమాలు లాంచ్ అయ్యాయి లేదా కొన్ని ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నాయి. ఈ సినిమాల ద్వారా సుమారు 40-50% దర్శకులు కొత్తవారే తెరకు పరిచయం కానున్నారు. ఇందులో చాలా మంది దర్శకులు కొత్త హీరో, హీరోయిన్లను పెట్టి సినిమాలు చేస్తున్నారు.

కొద్ది రోజుల క్రిత్రం దిల్ రాజు మాట్లాడుతూ ‘ ప్రస్తుత రోజుల్లో చాలామంది నటీనటులకు వారి టాలెంట్ ప్రూవ్ చేసుకునే అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు చాలా లో, మీడియం బడ్జెట్ సినిమాలు చాలా రూపొందుతున్నాయి. ఇక్కడ వారు ఎక్కడి నుంచి వచ్చారు అనే దాని కంటే వారు ఎంత మంచి సినిమా తీసారనేదే ముఖ్యం’ అని అన్నాడు.

కొత్త డైరెక్టర్ మారుతి ‘ఈ రోజుల్లో’ సినిమాని ఒక కోటి రూపాయలతో తెరకెక్కించారు కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. అలాగే వర్మ తీసిన ‘దొంగల ముఠా’ సినిమాకోసం మల్టిపుల్ కెనాన్ 5డి కెమెరాలను ఉపయోగించి, కొత్త ట్రెండ్ మొదలు పెట్టారు. ఈ కొత్త ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడున్న కాంపిటీషన్ ని ఎంతవరకూ తట్టుకోగలరు అనేదే ఇక్కడ ప్రశ్న. రాబోయే రోజుల్లో తెలుగు సినిమాల భవిష్యత్తు ఎలా ఉందనే దాని కోసం వేచి చూడాల్సిందే మరి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు