మన స్టార్ డైరెక్టర్లు ఎవరూ ఖాళీగా లేరు

Published on Feb 2, 2020 7:40 pm IST

ఈ 2020 సినీ పరిశ్రమకు విశేషమైన సంవత్సరమనే అనాలి. ఎందుకంటే ఇండస్ట్రీలోని దాదాపు అందరు స్టార్ డైరెక్టర్ల అందరి నుండి ఈ సంవత్సరం సినిమాలు రానున్నాయి. టాప్ లీగ్ డైరెక్టర్లలో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పలకరించనుండగా కొరటాల శివ చిరంజీవి చిత్రంతో మన ముందుకురానున్నారు. అలాగే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ సినిమా చేస్తున్నారు.

ఇక బోయపాటి శ్రీను బాలకృష్ణ చిత్రంతో పలకరించనున్నారు. అలాగే క్రిష్ పవన్ సినిమాను మొదలుపెట్టారు. హరీష శంకర్ సైతం పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొత్త సినిమాను స్టార్ట్ చేస్తున్నారు. ఇటీవలే ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో భారీ హిట్ అందుకున్న త్రివిక్రమ్ సైతం ఈ సంవత్సరం కొత్త సినిమాను ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారు. మరో దర్శకుడు వంశీ పైడిపల్లి నెక్స్ట్ మహేష బాబుతో సినిమాను మొదలుపెట్టే పనిలో ఉన్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’తో విజయం అందుకున్న అనిల్ రావిపూడి కూడా కొత్త సినిమాను సెట్ చేసుకునే పనిలో ఉన్నారు. ఇక లాంగ్ గ్యాప్ తీసుకున్న కృష్ణవంశీ, బొమ్మరిల్లు భాస్కర్ లాంటి వారు కూడా ఈ యేడాది తమ సినిమాల్ని రిలీజ్ చేయనున్నారు. మొత్తం మీద 2020లో స్టార్ దర్శకులంతా ఫుల్ బిజీగానే ఉండనున్నారు.

సంబంధిత సమాచారం :