క్యాన్స‌ర్ ఎవేర్‌నెస్ కోసం క్రికెట్ ఆడ‌నున్న టాలీవుడ్ స్టార్స్‌

Published on Apr 1, 2019 5:16 pm IST

హైద‌రాబాద్ త‌ల్వార్స్‌, టిసిఎ(తెలుగు సినిమా అకాడ‌మీ) ఈ రెండు టీమ్‌లు క‌లిసి ఇండో ఆఫ్రికా మీడియా కంపెనీ ఆధ్వ‌ర్యంలో మ‌న తెలుగుస్టార్స్ సౌత్ ఆఫ్రికాలో ఉన్న తెలుగువాళ్ళ‌తో క‌లిసి క్రికెట్ ఆడ‌బోతున్నారు. మొత్తం రెండు మ్యాచ్‌లు జ‌రుగుతున్నాయి. మే17,18న మ్యాచ్‌లు జ‌రుగుతాయి. 19న సాంస్కృతిక కార్య‌క్ర‌మం జ‌రుగుతుంది. క్యాన్స‌ర్ ఎవేర్నెస్ కోసం క్రికెట్ ఆడ‌టానికి ప్ర‌ధాన కార‌ణం. ఇందులో వ‌చ్చిన నిధుల‌ను ఆఫ్రికాలో ఉన్న చైల్డ్ హుడ్ క్యాన్స‌ర్ అసోసియేష‌న్‌కు అందించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ లెమ‌న్‌ట్రీ హోట‌ల్‌లో విలేక‌రుల స‌మావేశంలో…
ఛైర్మెన్ ర‌మేష్ మాట్లాడుతూ…ఇంత మంచి ప‌ని కోసం ముందుకు వ‌చ్చిన టాలీవుడ్ స్టార్స్‌కి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. క్యాన్స‌ర్ నుంచి బ్ర‌తికిద్దాం అన్న ఆలోచ‌నే ఈ క్రికెట్ టాలీవుడ్ అసోసియేష‌న్‌ యొక్కముఖ్య ఉద్దేశం. బిజీ షెడ్యూల్‌ని కూడా ప‌క్క‌న పెట్టి రావ‌డం గ్రేట్‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఎప్పుడూ సౌత్ ఆఫ్రికాలో ఇలాంటి కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌లేదు. మొట్ట మొద‌టి సారి వీళ్ళు సౌత్ ఆఫ్రికా వ‌చ్చి మ‌న సంస్కృతిని వాళ్ళ‌కు ప‌రిచ‌యం చేసి వాళ్ళ సంస్కృతి గురించి మ‌నం తెలుసుకోవ‌డం కోసం ఒక సాంస్కృతిక కార్య‌క్ర‌మం
లో హాజరు కాబో తున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు.
అభిన‌వ్ స‌ర్ధార్ మాట్లాడుతూ… మా టాలీవుడ్ హీరోలంద‌రికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. హైద‌రాబాద్ త‌ల్వార్స్‌తో క‌లిసి భాగ‌స్వాముల‌మై ఈ మ్యాచ్ ఆడ‌డం ఆనందంగా ఉంది. మాకు మీ అంద‌రి సపోర్ట్ కావాలి. ఈ ఐడియా రాగానే చాలా త‌క్కువ స‌మ‌యంలో 15, 20రోజుల్లో మొత్తం ప్లాన్ చేశాము. ఈ క్రికెట్ ఆడ‌డానికి ప్ర‌ధాన కార‌ణం క్యాన్స‌ర్ ఎవేర్నెస్ కోసం అన్నారు.
శ్రీ‌ధ‌ర్ రావ్ మాట్లాడుతూ … ఇంత మంచి ప‌నిని ముందుకు తీసుకువెళ్ళ‌డానికి ప్ర‌ధాన కార‌ణం శ్రీ‌కాంత్ అన్న‌. ఇది మొద‌టి సారి మాత్ర‌మే. ఇంకా చాలా గేమ్స్ ఆడ‌తాం. ఆఫ్రికా టీమ్ అంద‌రికీ మా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఎవ్వ‌రికీ క‌ల‌గ‌ని అవ‌కాశం మాకు క‌లిగించినందుకు మా టీమ్ త‌ర‌పున ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.
హీరో శ్రీ‌కాంత్ మాట్లాడుతూ…నేను ఒక్క‌డినే కెప్టెన్ కాదు నాతోపాటు ఇక్క‌డున్న వారంద‌రూ కెప్టెన్సే.మొద‌టిసారి సౌత్ ఆఫ్రికాలో మ్యాచ్ ఆడ‌టం అంటే అస‌లు జ‌రుగుద్దో లేదో అనుకున్నా. కాని వాళ్ళ కాన్ఫిడెంట్ చూసి ముందుకు వెళుతున్నాం. క్రికెట్ ఆడ‌టం ముందు స్టార్ట్ చేసిందే మా టాలీవుడ్ హీరోలు. చిరంజీవి, నాగార్జున వాళ్ళంద‌రూ ముందు మొద‌లు పెట్టారు. ఇది క‌మ‌ర్షియ‌ల్‌గా ఆడే ఆట కాదు. ఒక మంచి ప‌ని కోసం ఈ కార్య‌క్ర‌మానికి మేమంద‌రం గ్రూప్ అయ్యాం. మే 16-17 ద‌ర్బార్‌లో దిగుతాం. 18న గేమ్ ఉంటుంది. 19న ఒక క‌ల్చ‌ర‌ల్ ప్రోగ్రాం ఉంటుంది. మీరంద‌రూ మాకు త‌ప్ప‌కుండా స‌పోర్ట్ చెయ్యాల‌న్నారు.

సంబంధిత సమాచారం :