ఫ్రంట్ లైన్ వారియర్స్ కోసం టాలీవుడ్ స్టార్లు

Published on Jun 9, 2021 2:10 am IST

కరోనా కష్టకాలంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలు మరువలేనివి. డాక్టర్లు, నర్సులు, పారిశుధ్య కార్మికులు, పోలీసులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కోవిడ్ బాధితులకు సేవలు అందించారు. ఈ క్రమంలో అనేకమంది ప్రాణాలను సైతం కోల్పోయారు. వారి త్యాగాలను గుర్తుండిపోయేలా చేయడానికి మన టాలీవుడ్ సార్లు నడుం బిగిస్తున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ మీద మెసేజ్ ఇచ్చేలా ఫిలిమ్స్ చేస్తున్నారు. ఇప్పటికే హీరో నాని ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. షూటింగ్ కూడ జరుగుతోంది. త్వరలోనే దానికి సంబంధించిన వివరాలు తెలియనున్నాయి.

దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సైతం పాండమిక్ సమయంలో పోలీస్ వారి సేవలను గౌరవించేలా ఒక షార్ట్ టైమ్ ఫిల్మ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇక రామ్ చరణ్ సతీమణి ఉపాసన సైతం వైద్యులు, నర్సుల సేవలను గుర్తుచేసేలా అరగంట నిడివి ఉన్న షార్ట్ ఫిల్మ్ నిర్మించనున్నారని, ఇందులో శర్వానంద్ ప్రధాన పాత్ర చేయనుండగా రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేయనున్నారని టాక్. మొత్తానికి టాలీవుడ్ స్టార్లు ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలు ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :