విశాఖ లీగ్‌లో ‘అనకాపల్లి’ ట్రైలర్ లాంచ్ చేసిన టాలీవుడ్ థండర్స్ టీమ్

విశాఖ లీగ్‌లో ‘అనకాపల్లి’ ట్రైలర్ లాంచ్ చేసిన టాలీవుడ్ థండర్స్ టీమ్

Published on Jul 27, 2026 8:00 AM IST

విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన ‘అనకాపల్లి’ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. విశాఖపట్నంలో నిర్వహించిన ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2 వేదికగా టాలీవుడ్ థండర్స్ టీమ్ సభ్యులు హీరో శ్రీకాంత్, సంగీత దర్శకుడు తమన్, సుధీర్ బాబు, తరుణ్, అశ్విన్ బాబు తదితరులు ఈ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

రా అండ్ రస్టిక్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు ఒక కీలక పాత్రలో నటించారు. ఇంద్రజ, మహబూబ్ బాషా, నందిని రాయ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఉదయ్ భాగవతుల సంభాషణలు అందించిన ఈ సినిమాకు దేవ్ జండ్ సంగీతం సమకూర్చగా, మాయా.వి ఛాయాగ్రహణం, శ్రీకృష్ణ అట్టలూరి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఆగస్ట్ 7న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు