ప్రస్తుతం మన టాలీవుడ్ లో స్టార్ హీరోలు అంతా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నా సంగతి తెలిసిందే. మరి వారిలో మెగాస్టార్ చిరంజీవి, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ మరియు వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్యలు కూడా ఒకరు. అయితే ఈ ముగ్గురూ తమ భారీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ఈ ముగ్గురూ కూడా తమ ప్రాజెక్ట్ ల యాక్షన్ మోడ్ లో బిజీగా ఉన్నారు.
ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో చేస్తున్న భారీ పీరియాడిక్ డ్రామా ఫౌజీ లో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ లో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. అలానే బాలయ్యతో దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా సాలిడ్ యాక్షన్ ఎపిసోడ్ ని చేసినట్టు తెలిసింది. ఇక మెగాస్టార్ తన 158వ సినిమా కోసం బాబీతో ఒక ఊహించని యాక్షన్ ఎపిసోడ్ ని అది కూడా రిస్కీ స్టంట్స్ ని నేరుగా చిరునే చేస్తున్నట్టుగా సినీ వర్గాల్లో టాక్. ఇలా మన తెలుగు సినిమాకి చెందిన టాప్ హీరోస్ అంతా ఇంట్రెస్టింగ్ గా యాక్షన్ మోడ్ లోనే ఉండడం గమనార్హం.


