వైరల్ : ప్రస్తుత మహానటి గా సమంత..టాప్ ప్రొడ్యూసర్స్ మాట.!

వైరల్ : ప్రస్తుత మహానటి గా సమంత..టాప్ ప్రొడ్యూసర్స్ మాట.!

Published on Dec 3, 2022 10:00 AM IST

లేటెస్ట్ గా మన టాలీవుడ్ దగ్గర రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో సూపర్ హిట్ గా నిలిచిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం “యశోద”. వెర్సటైల్ నటి సమంత నుంచి చాలా కాలం తర్వాత వచ్చిన ఈ చిత్రం సాలిడ్ వసూళ్లు అందుకోవడమే కాకుండా సమంత కెరీర్ లో భారీ హిట్ గా నిలిచి ఆమె బౌన్స్ బ్యాక్ కి కారణం అయ్యింది.

మరి ఈ సినిమా కోసం సమంత పెట్టిన ఎఫర్ట్స్ కూడా ఏ లెవెల్లో ఉన్నాయో అందరికీ తెలిసిందే. మరి లేటెస్ట్ గా అయితే ఈమెని మహానటి తో టాలీవుడ్ టాప్ నిర్మాతలు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు మరియు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ లు బాలయ్య టాక్ షోలో చెప్పడం ఇపుడు వైరల్ గా మారిపోయింది.

మరి బాలయ్య తన ప్రశ్నగా ఇద్దరు నిర్మాతలకి ప్రస్తుత జెనరేష్ లో ఎవరు మహానటి అంటే ఇద్దరు కూడా సమంత పేరునే రాయడం ఫ్యాన్స్ లో మరింత కేజ్రీగా మారింది. దీనితో సామ్ ని ఎన్నో ఏళ్ల నుంచి సినిమాలు చూస్తూ వస్తున్న ఈ టాప్ నిర్మాతలే మహానటి అని ఒప్పుకున్నాక ఇక ఆమె కోసం ఎవరూ ఎన్ని కామెంట్స్ చేసినా వాటిని పట్టించుకోనవసరం లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు