నాగ్ బర్త్ డే సంధర్భంగా రేపు దేవదాస్ ఫస్ట్ సాంగ్ విడుదల !

నాగ్ బర్త్ డే సంధర్భంగా రేపు దేవదాస్ ఫస్ట్ సాంగ్ విడుదల !

Published on Aug 28, 2018 9:22 PM IST

Devadas1
సీనియర్ అగ్ర హీరో కింగ్ నాగార్జున ప్రస్తుతం నాని తోకలిసి ‘దేవదాస్’ అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రేపు నాగ్ బర్త్ డే సంధర్బంగా ఈరోజు ఈచిత్రం యొక్క మోషన్ పోస్టర్ మరియు సినిమాలోని నాగ్ స్టిల్స్ ను విడుదల చేశారు. రేపు ఈ చిత్రంలో ని మొదటి సాంగ్ ను విడుదలచేయనున్నారు.

వారు వీరు అనే ఈ సాంగ్ కామెడీ గా వుంటుందట. చిత్ర సంగీత దర్శకుడు మణిశర్మ ఈ సాంగ్ ను స్పెషల్ కేర్ తీసుకొని కంపోజ్ చేశారు. శ్రీ రామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈచిత్రాన్ని వైజయంతి మూవీస్ నిర్మిస్తుంది. పక్క కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదలకానుంది.

తాజా వార్తలు