తొలి సినిమాతో సిద్దమవుతున్న టాప్ డైరెక్టర్ కుమారుడు

తొలి సినిమాతో సిద్దమవుతున్న టాప్ డైరెక్టర్ కుమారుడు

Published on Jun 16, 2015 1:58 PM IST

Satya-Prabhas

నాటి తరం దర్శకులలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఫేమస్ డైరెక్టర్ రవిరాజ పినిశెట్టి. గతంలో ఆయన తీసిన యముడికి మొగుడు, చంటి, పెదరాయుడు, రాజా విక్రమార్క, కొండపల్లి రాజా మొదలైన సూపర్ హిట్ సినిమాలకు రవిరాజ పినిశెట్టి దర్శకత్వం వహించాడు. ఇప్పుడు ఆయన బాటలోనే తన కుమారుడు సత్య ప్రభాస్ దర్శకుడిగా తెలుగు, తమిళ చిత్ర సీమకి పరిచయం కానున్నాడు. సత్య ప్రభాస్ అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చదవడమే కాకుండా, అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ గా బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు కూడా సత్య ప్రభాస్ కావడం విశేషం. సత్య ప్రభాస్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘మలుపు’.

తెలుగు – తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ మలుపు సినిమా ఆడియోని ఇటీవలే దాసరి చేతుల మీదుగా రిలీజ్ చేసారు. ఈ సినిమాలో సత్య ప్రభాస్ తమ్ముడు ఆది పినిశెట్టి హీరోగా నటించాడు. నిక్కి గల్రాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా రిచా మళ్ళీ తెరపై కనిపించనుంది. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మలుపు సినిమా రూపొందింది. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరి డైరెక్టర్ గా పరిచయం అవుతున్న సత్య ప్రభాస్ తన తండ్రి లానే ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో లేదో చూడాలి అంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే..

తాజా వార్తలు