చరణ్, బోయపాటిల సినిమాకు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలోలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నెలలో ‘రంగస్థలం 1985’ షూట్ పూర్తికాగానే ఈ చిత్ర షూటింగ్ మొదలవుతుంది. సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రానికి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అన్దికిన్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ వార్తపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఈ కాంబినేషన్ గనుకు కుదిరితే సినిమాకు బాగా ప్లస్ అవుతుంది. దేవి గతంలో చరణ్ చేసిన ‘ఎవడు’, ఇప్పడు చేస్తున్న ‘రంగస్థలం’ చిత్రాలకు, బోయపాటి డైరెక్ట్ చేసిన ‘లెజెండ్, జయ జానకి నాయక’ సినిమాలకు హిట్ సంగీతాన్ని అందించారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు