ఎన్టీఆర్ బయోపిక్ కోసం టాప్ మ్యూజిక్ డైరెక్టర్

20th, October 2017 - 11:40:33 AM


నటరత్న స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితం తెలుగు వారికి ఆదర్శం అలాంటి మహా మనిషి జీవిత చరిత్రను ను తెరకెక్కించబోతున్నాడు డైరెక్టర్ తేజ, జనవరి 18 (ఎన్టీఆర్ వర్ధంతి) రోజున ఈ సినిమా ప్రారంభం అవుతుంది, అలాగే మే 28 (ఎన్టీఆర్ జయంతి) రోజున సినిమా విడుదల చెయ్యాలనేది చిత్ర యూనిట్ సభ్యుల ఆలోచన. బాలకృష్ణ ఈ సినిమాలో నటిస్తూ నిర్మిస్తుండడం విశేషం.

సినిమాకు సంభందించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. టాప్మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ సినిమా కోసం సంగీతం అందిస్తున్నారు. ఇలాంటి భారి సినిమాలకు నేపద్య సంగీతం ప్రధానం కావున కీరవాణి ఈ సినిమాకు సరైన ఎంపిక అని చెప్పాలి. ఈ చిత్రానికి సంభందించి ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. తేజ ఈ సినిమాతో ఎన్టీఆర్ జీవితాన్ని తెలుగు ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తాడని కోరుకుందాం.