‘అఖిల్’ సినిమాకి మరో టాప్ మ్యూజిక్ డైరెక్టర్.?

‘అఖిల్’ సినిమాకి మరో టాప్ మ్యూజిక్ డైరెక్టర్.?

Published on Sep 6, 2015 2:03 PM IST

akhil
అక్కినేని ఫ్యామిలీ నుంచి సోలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న మూడవతరం హీరో అఖిల్ అక్కినేని. మనం సినిమాలో చేసిన చిన్న ఇంట్రడక్షన్ సినిమా తర్వాత అఖిల్ చేస్తున్న మొదటి సినిమా ‘అఖిల్’. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ద్వారా సయేషా సైగల్ ని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు. అఖిల్ మొదటి సినిమా విషయంలో ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా అన్నిటిలోనూ బెస్ట్ అవుట్ పుట్ వచ్చేలా ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాలోని సాంగ్స్ అన్నీ ఆల్ టైం హిట్స్ అవ్వాలి, అలాగే ఫాస్ట్ బీట్స్ తో పాటు, సూపర్బ్ మెలోడీస్ కూడా ఉండాలని ఎస్ఎస్ తమన్ – అనూప్ రూబెన్స్ లను మ్యూజిక్ డైరెక్టర్స్ గా ఎంచుకున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం ది బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రాబట్టుకోవాలనే ఉద్దేశంతో ఒక టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ని రంగంలోకి దింపారు. అతనే మెలోడీ బ్రహ్మ మణిశర్మ. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అయ్యింది. అందుకే ఆయనని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్పెషలిస్ట్ అని కూడా అంటారు. అఖిల్ సినిమాకి మణిశర్మ నేపధ్య సంగీతం అందించనున్నాడని సమాచారం. దీన్ని ప్రకారం ‘అఖిల్’ సినిమా మొత్తంగా ముగ్గురు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేస్తున్నారనమాట. దేన్నీ బట్టే ఈ చిత్ర నిర్మాత అయిన నితిన్ అఖిల్ సినిమా విషయంలో ఎంత కేర్ తీసుకుంటున్నాడో తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ పాటని యూరప్ లో షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్ తర్వాత మరో పాటని హైదరాబాద్ లో షూట్ చేస్తారు. దాంతో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. సెప్టెంబర్ 2ఒన ఈ సినిమా ఆడియోని రిలీజ్ చేసి అక్టోబర్ 22న దసరా కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు