‘టచ్ చేసి చూడు’ ఆడియో విడుదల తేదీ ఖరారు !

ర‌వితేజ క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం ‘ట‌చ్ చేసి చూడు’. రాశీ ఖ‌న్నా, సీర‌త్ క‌పూర్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాను విక్రమ్ సిరికొండ ద‌ర్శ‌క‌త్వం వహించగా నలమలుపు శ్రీనివాస్ (బుజ్జి) వల్లభనేని వంశి మోహన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటివల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ లభించింది.

ప్రీతమ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో వేడుక హైదరాబాద్లో ఈ నెల 25న జరగబోతోంది. రవితేజ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. మాస్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ఫిబ్రవరి మొదటి వారంలో విడుదలకానుంది. ఈ సినిమా తరువాత రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘నేల టికెట్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.