‘సాహో’ తో పోటీకి సిద్దమైన బాలీవుడ్ స్టార్ హీరోస్.

Published on Jun 18, 2019 11:52 am IST

ఇటీవల విడుదలైన ప్రభాస్ “సాహో” టీజర్ మూవీ పై అంచనాలను ఆకాశానికి చేర్చింది. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిన హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో టీజర్ ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. విడుదలకు కేవలం రెండు నెలలు సమయం మాత్రమే ఉండటంతో యంగ్ డైరెక్టర్ సుజీత్ ‘సాహో’ మిగిలిన చిత్రీకరణ భాగాన్ని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాడు. పాటల చిత్రీకరణ మినహా దాదాపు ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తయిందని సమాచారం.

ఆగస్టు 15నప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ మూవీకి బాలీవుడ్ నుండి రెండు పెద్ద చిత్రాల నుండి గట్టిపోటీ ఎదురుకానుంది. బాలీవుడ్ స్టార్స్ అయిన అక్షయ్ కుమార్ నటించిన “మిషన్ మంగళ్”,జాన్ అబ్రహం నటించిన “బాట్లా హౌస్” అదే రోజు విడుదల కానున్నాయి. ఈ రెండు చిత్రాలు యధార్థ సంఘటనలు ఆధారంగా తెరకెక్కుతున్నవే . “మిషన్ మంగళ్” భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మార్స్ గ్రహం పైకి ప్రయోగించిన మంగళ్ యాన్ ఉపగ్రహం సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుండగా,జాన్ అబ్రహం నటిస్తున్న ‘భాట్లా హౌస్” 2008లో ఢీల్లీలో జరిగిన తీవ్రవాదుల ఎన్కౌంటర్ నేపథ్యంలో నిర్మిస్తున్నారు.

ప్రభాస్ ‘సాహో’ తో ఈ ఇద్దరు టాప్ స్టార్స్ తో పోటీపడనున్నాడు. ఐతే బాలీవుడ్ వివాదాస్పద నటుడు, విశ్లేషకుడైన కమల్ ఆర్ ఖాన్ ఈ మూడు చిత్రాలలో మీరు ఏ సినిమా చూస్తారు? అనే పోల్ నిర్వహించగా ఆసక్తికరంగా ప్రభాస్ సాహో కి 63%ఓట్లు పడ్డాయి. దీనిని బట్టి బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ప్రభాస్ ‘సాహో’ కొరకు ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థం అవుతుంది.

సంబంధిత సమాచారం :

X
More