బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’(Dhurandhar) బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన ఈ స్పై యాక్షన్ చిత్రానికి సీక్వెల్‌గా ‘ధురంధర్ ది రివెంజ్’ చిత్రాన్ని మార్చి 19న వరల్డ్‌వైడ్‌గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయగానే దక్షిణాదిన పలు చిత్రాలు తమ రిలీజ్ డేట్ వాయిదా వేసుకుంటున్నాయి.
ఇప్పటికే టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న అడివి శేష్ ‘డెకాయిట్’ చిత్ర రిలీజ్ డేట్‌ను మేకర్స్ వాయిదా వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక కన్నడ రాక్‌స్టార్ యష్ నటిస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘టాక్సిక్’ రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ, ‘టాక్సిక్’ టీమ్ మాత్రం తమ సినిమాను అనుకున్న డేట్‌కే రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఈ సినిమాను దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది.
‘ధురంధర్ 2’(Dhurandhar 2) రిలీజ్ అయినా, తమ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని ‘టాక్సిక్’ చిత్ర యూనిట్ భావిస్తోంది. దీంతో ఎలాంటి పోటీ ఉన్నా, తమ సినిమాను చెప్పినరోజునే తీసుకొచ్చేందుకు యష్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు. దీన్నిబట్టి ఈ ‘టాక్సిక్’ మూవీపై మేకర్స్ ఎంత ధీమాగా ఉన్నారో అర్థమవుతుంది. మరి నిజంగానే ‘టాక్సిక్’ చిత్రం ‘ధురంధర్ 2’తో బాక్సాఫీస్ దగ్గర వార్‌కు దిగుతుందా అనేది చూడాలి.
