‘అర్జున్ సురవరం’ ట్రైలర్ కు టైం వచ్చింది !

Published on Apr 24, 2019 12:30 am IST

యువ హీరో నిఖిల్ హీరోగా లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్ గా నూతన దర్శకుడు టి.ఎన్ సంతోష్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘అర్జున్ సురవరం’. మే 1వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. కాగా తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఏప్రిల్ 25వ తేదీన ఉదయం 10 గంటలకు ‘ఏ ఎమ్ బి’ మాల్ లో ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు. ఈ మేరకు చిత్రబృందం, పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.

ఇక ఐటివలె విడుదలైన ఈ చిత్రం యొక్క మొదటి పాట ‘కన్నే కన్నే’ ప్రసుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో టైటిల్ రోల్ లో నిఖిల్ జర్నలిస్ట్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాకి సామ్ సి ఎస్ సంగీతం అందిస్తుండగా.. కావ్య వేణుగోపాల్ మరియు రాజ్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :