అఖిల్ ఇవ్వనున్న నాగ్ బర్త్ డే స్పెషల్ ఏంటో తెలుసా.?

అఖిల్ ఇవ్వనున్న నాగ్ బర్త్ డే స్పెషల్ ఏంటో తెలుసా.?

Published on Jul 20, 2015 12:20 AM IST

Akhil-Akkineni

అక్కినేని ఫ్యామిలీ నుంచి పరిచయం కానున్న మూడవతరం యంగ్ హీరో అఖిల్ అక్కినేని. అఖిల్ మొదటి సినిమా కోసం అక్కినేని అభిమానులతో పాటు, తెలుగు సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మాస్ పల్స్ తెలిసిన కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు రావడంతో ఈ సినిమా గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 22న రిలీజ్ చేయనున్నామని తెలియజేశాం.

తాజా సమాచారం ప్రకారం అఖిల్ తన ఫాదర్ నాగార్జున పుట్టిన రోజున అభిమానులకు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్దమవుతున్నాడు. అఖిల్ అండ్ టీం నాగార్జున పుట్టిన రోజు కానుకగా అనగా ఆగష్టు 29న ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ టైం కల్లా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. అలాగే టైటిల్ ని కూడా త్వరలోనే ఫైనలైజ్ చేయనున్నారు. అఖిల్ తో పాటు సయేషా సైగల్ హీరోయిన్ గా పరిచయం కానుంది. ప్రస్తుతం ఈ చిత్ర టీం సౌత్ ఆఫ్రికాలో సాంగ్స్ మరియు కొన్ని సీన్స్ ని షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత ఫైనల్ షెడ్యూల్ హైదరాబాద్ లో ఉంటుంది. యంగ్ హీరో నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ – ఎస్ఎస్ తమన్ కలిసి మ్యూజిక్ అందిస్తున్నారు.

తాజా వార్తలు