
‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు రాజమౌళి శిష్యుడు త్రికోటి. ఒక డిఫరెంట్ & బోల్డ్ కాన్సెప్ట్ తీసుకుని అందరూ చూసే విధంగా తొలి సినిమాను రూపొందించినందుకు త్రికోటిని పలువురు ప్రశంసించారు. ఈ దర్శకుడు తన రెండవ సినిమాను అక్కినేని హీరోతో చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.
గతంలో అక్కినేని నాగార్జున సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం త్రికోటి లభించింది. స్క్రిప్ట్ కుదరకపోవడంతో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమా ఆడియో వేడుకలో త్రికోటితో సినిమా చేస్తానని నాగార్జున మాటిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం త్రికోటి తన రెండో సినిమా స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారు. నాగ చైతన్య హీరోగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. అసలు ఆ స్క్రిప్ట్ ఎవరిని దృష్టిలో పెట్టుకుని త్రికోటి రెడీ చేస్తున్నారో..? అధికారికంగా ప్రకటించే వరకూ ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

