జనవరి 30న ప్రపంచవ్యాప్తంగా ‘త్రిముఖ’ గ్రాండ్ రిలీజ్

జనవరి 30న ప్రపంచవ్యాప్తంగా ‘త్రిముఖ’ గ్రాండ్ రిలీజ్

Published on Jan 17, 2026 7:00 AM IST

Trimukha

సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘త్రిముఖ’ చిత్ర విడుదల తేదీ ఖరారైంది. 2026 జనవరి 30న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

వైవిధ్యమైన కథాంశంతో, అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ సినిమాను రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. శక్తివంతమైన కథనం, ఆకట్టుకునే విజువల్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామని పేర్కొన్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల సమష్టి కృషి, తమ సుదీర్ఘ సృజనాత్మక ప్రయాణం ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తుందని చిత్ర బృందం విశ్వాసం వ్యక్తం చేసింది.

నూతన సంవత్సర కానుకగా వస్తున్న ‘త్రిముఖ’ ప్రేక్షకులపై చెరగని ముద్ర వేస్తుందని నిర్మాతలు నమ్ముతున్నారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా ట్రైలర్, పాటలు, ఇతర విశేషాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. థియేటర్లలోకి రానున్న తమ చిత్రానికి ప్రేక్షకులు, మీడియా మద్దతు ఉండాలని కోరారు.

తాజా వార్తలు