సస్పెన్స్ స్క్రీన్ ప్లే హైలైట్ గా త్రిపుర

సస్పెన్స్ స్క్రీన్ ప్లే హైలైట్ గా త్రిపుర

Published on Nov 2, 2015 8:37 PM IST

tripura
టాలీవుడ్ లో ప్రస్తుతం ట్రెండ్ సెట్ చేస్తున్న సక్సెస్ఫుల్ ఫార్ములా హర్రర్ కామెడీ.. ఇప్పడు అదే జోనర్లో త్వరలో ఈ వారం అనగా నవంబర్ 6న ప్రేక్షకుల మనముందుకు రానున్న సినిమా ‘త్రిపుర’. తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు ఉన్న స్వాతి టైటిల్ పాత్రలో నటించగా, అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. గత ఏడాది వచ్చి హిట్ అయిన ‘గీతాంజలి’ సినిమాకి దర్శకత్వం వహించిన రాజ్ కిరణ్ సినిమాకి దర్శకుడు.

ఈ సినిమాకి స్క్రీన్ ప్లే హైలైట్ అవుతుందని ఈ చిత్ర టీం అంటోంది.. కానీ ఎలాంటి తరహా స్క్రీన్ ప్లే తో ఆకట్టుకోనున్నారు అని నవీన్ చంద్రని అడిగితే ‘త్రిపుర లో మీకు చాలా టిపికల్ స్క్రీన్ ప్లే కనపడుతుంది. చివరి దాకా ఏం జరుగుందా, ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేది అర్థం కాదు. అలా అని బోరింగ్ గా ఉండదు. చాలా థ్రిల్స్ ఉంటాయి, అలాగే చాలా సీన్స్ భయపెడతాయని’ అన్నాడు. చినబాబు – రాజశేఖర్ కలిసి నిర్మించిన ఈ సినిమా 600 థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

తాజా వార్తలు