ఎంతో ఆలస్యం తర్వాత త్రిష కంప్లీట్ చేసింది

Published on Jan 27, 2021 2:00 am IST

’96’ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన స్టార్ నటి త్రిష అదే జోరు కొనసాగిస్తోంది. ఈ సినిమా విజయంతో మరోసారి ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ‘పరమపాదం విలయాట్టు, గర్జనై, శతురంగ వెట్టై 2, రాంగి, షుగర్, రామ్’ లాంటి క్రేజీ సినిమాలున్నాయి. వీటితోపాటు మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’లో కూడ త్రిష కీ రోల్ చేస్తోంది.

ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే మొదలైంది. నటులంతా ఒక్కొక్కరిగా షూటింగ్లో జాయిన్ అవుతున్నారు. త్రిష కూడ త్వరలోనే చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉంది. అందుకే ఆమె చాలా కాలంగా సెట్స్ మీద ఉన్న చిత్రం ‘రాంగి’ని కంప్లీట్ చేసేశారు. లాక్ డౌన్ వలన కొంత షూటింగ్ మిగిలిపోవడంతో కొన్నిరోజుల క్రితం రీస్టార్ట్ చేసి నిన్ననే కంప్లీట్ చేశారు. ఎమ్.శరవణన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కథను అందిచడం విశేషం.

సంబంధిత సమాచారం :