యునీక్ వెడ్డింగ్ గిఫ్ట్ అందుకున్న త్రిష

యునీక్ వెడ్డింగ్ గిఫ్ట్ అందుకున్న త్రిష

Published on Jan 22, 2015 10:08 AM IST

trisha-Varun-Mannian

తన చిరకాల స్నేహితుడు వరుణ్ మణియన్ తో వివాహానికి చెన్నై సుందరి త్రిష రెడీ అవుతుంది. వరుణ్ బాగా సంపన్నుల కుటుంబానికి చెందిన అబ్బాయి కావడంతో త్రిషకు ఖరీదైన కానుకలు ప్రజెంట్ చేస్తాడని అందరూ భావిస్తారు.

రోల్స్ రాయిస్ వంటి ఖరీదైన కానుక త్రిషకు బహుకరించిన వరుణ్.. మరో ప్రత్యేక కానుకను అందించాడు. త్రిషకు మూగ జీవాలు అంటే ఎంత ప్రేమో ప్రజలందరికి తెలుసు. సమయం దొరికినప్పుడల్లా మూగ జీవాల సేవలో మునిగిపోతుంది. అందుకే, నిరాశ్రయులైన మూగ జీవాలకు ఆహారం, వైద్యం, షెల్టర్ అందించాలని వరుణ్ నిర్ణయం తీసుకున్నారు.

వరుణ్ నిర్ణయం త్రిషకు ఎంతో అనందం కలిగించిందని సమాచారం. ఈ నెల 24న గ్రాండ్ డిన్నర్ పార్టీని ఈ లవ్ కపుల్ అరేంజ్ చేశారు. తెలుగు, తమిళ, హిందీ సినిమా రంగాల ప్రముఖులు ఈ పార్టీకి హాజరవుతారని సమాచారం.

తాజా వార్తలు