పెట్టా షూటింగ్ లో పాల్గొంటున్న స్టార్ హీరోయిన్ !

Published on Oct 1, 2018 1:26 pm IST

‘కాలా’ తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్నచిత్రం ‘పెట్టా’. ప్రస్తుతం ఈచిత్ర షూటింగ్ వారణాసి లో జరుగుతుంది. ఈషెడ్యూల్ లో రజినీ, విజయ్ సేతుపతి పాల్గొంటుండగా తాజాగా ప్రముఖ హీరోయిన్ త్రిష కూడా జాయిన్ అయ్యారు. వీరి ముగ్గురి కలయికలో సినిమాకు సంభందించిన కొన్ని ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈచిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు వున్నాయి.

సంబంధిత సమాచారం :