షూటింగ్ పూర్తి చేసుకున్న త్రిష ‘నాయకి’

షూటింగ్ పూర్తి చేసుకున్న త్రిష ‘నాయకి’

Published on Dec 18, 2015 10:25 AM IST

nayaki
తెలుగు, తమిళ భాషల్లో స్టార్‍ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతోన్న త్రిష, తాజాగా ‘నాయకి’ పేరుతో ఓ తెలుగు, తమిళ భాషల్లో ఓ లేడీ ఓరియంటడ్ హర్రర్ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. తన కెరీర్లో మొదటిసారిగా ఒక పూర్తి స్థాయి లేడీ ఓరియంటడ్ సినిమా చేస్తూండడంతో త్రిష, ‘నాయకి’పై భారీ ఆశలు పెట్టుకున్నారు. గోవీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఈమధ్యే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఇక షూటింగ్ పూర్తైన సందర్భంగా సినిమా విశేషాలను పంచుకుంటూ దర్శకుడు గోవీ, త్రిష్ కెరీర్‌కు నాయకి సినిమా ఓ ప్రత్యేక సినిమాగా నిలుస్తుందని తెలిపారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి జనవరి నెలాఖర్లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్లు గోవి స్పష్టం చేశారు. త్రిషతో పాటు గణేష్ వెంకట్రామన్, సత్యం రాజేష్, జేపీ, మాధవి లత, సుష్మా రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు ఇప్పటికే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు