స్టార్ హీరోయిన్‌ కి ఏమైంది ? జరిగిన ప్రమాదం నిజమేనా ?

స్టార్ హీరోయిన్‌ కి ఏమైంది ? జరిగిన ప్రమాదం నిజమేనా ?

Published on Nov 7, 2022 7:01 AM IST

స్టార్ హీరోయిన్ త్రిష తన ఇంస్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ లో తన కాలికి పట్టితో ఉన్నటువంటి ఓ ఫోటోను త్రిష షేర్ చేసింది. ఈ ఫోటోను బట్టి త్రిష కాలు ఫ్రాక్చర్ అయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. దాంతో ఈ ఫోటో చూసి త్రిష అభిమానులు ఆందోళన పడుతూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు మీకేం అయింది ?, ఎందుకు ఆ కట్టు ?’ అంటూ మెసేజ్ లు పోస్ట్ చేస్తున్నారు.

ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న త్రిష అనుకోకుండా ప్రమాదానికి గురి కావడంతో ఆమె కాలు ఇలా ఫ్రాక్చర్ అయిందని తెలుస్తోంది. త్రిష త్వరగా కోలుకోవాలని ఆమె ఫాలోవర్స్ కోరుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. త్రిష ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తోంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్ 1’ లో కుండవై పిరట్టియార్ అనే పాత్రలో త్రిష నటించి మెప్పించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు