
ఈ మధ్య కాలంలో తారలు తమ అభిమానులతో మీడియా ద్వారా కంటే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ద్వారానే ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నారు. అలానే అందాల భామ త్రిష కూడా సోషల్ నెట్వర్కింగ్ ద్వారా తన అభిమానులతో ఎప్పుడూ ఇంటరాక్ట్ అవుతోంది. ఇన్ని రోజులు త్రిషని ఫాలో అవుతున్న అభిమానులకు ఇప్పుడొక శుభవార్త.
ఇన్ని రోజులు అది నిజంగా త్రిష అకౌంట్ ఏనా? కాదా? అని ఉన్న అనుమానాలకు తెరపడింది. ఎందుకంటే త్రిష అకౌంట్ ట్విట్టర్ ద్వారా వెరిఫై అయ్యింది. ‘నా అకౌంట్ వెరిఫై అయ్యింది’ అని త్రిష ట్వీట్ కూడా చేసింది. ఇక నుంచి తన అభిమానులు ఏ మాత్రం సంకోచించకుండా మీ అభిమాన హీరోయిన్ త్రిషతో ఇంటరాక్ట్ అవ్వండి.
ప్రస్తుతం త్రిష తెలుగులో నందమూరి బాలకృష్ణ హీరోగా సత్యదేవ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ గా నటించనుంది. అలాగే అజిత్ హీరోగా గౌతం వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న తమిళ సినిమాలో కూడా నటిస్తోంది.

