ఈ సారి త్రివిక్రమ్ కొత్తగా ట్రై చేసినట్టు ఉన్నాడు !

Published on Oct 3, 2018 3:59 am IST


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సారి తన శైలి మార్చాడా ? అరవింద సమేత టీజర్ పోస్టర్లు, మరియు ప్రోమోలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా త్రివిక్రమ్ తన మేకింగ్ స్టైల్ ను, తన రైటింగ్ స్టైల్ ను పూర్తిగా మార్చినట్లుగా కనిపిస్తోంది. మాములుగా త్రివిక్రమ్ ఎప్పుడు మీనింగ్ ఫుల్ డైలాగ్స్ కి ప్రాసలను యాసలను మిక్స్ చేసి.. కామెడీని, ఎమోషన్ని పండిస్తాడు.

అయితే ఎన్టీఆర్ అరవింద సమేతలో ఇవన్ని ఉన్నా.. ప్రధానంగా రివెంజ్ స్టోరీకి పూర్తి యాక్షన్ అంశాలను జోడించి తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవటానికి త్రివిక్రమ్ ప్రయత్నస్తున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ సినిమాలో బాగా హైలెట్ అవ్వుతుందట. మూవీలో మెయిన్ గా హీరో ‘హీరోయిజం’ కంటే.. కథలోని తల్లి ఎమోషన్ పైనే ఎక్కువుగా ఫోకస్ పెట్టారని తెలుస్తోంది.

కాగా ఇప్పటికే ఈ చిత్రం పట్ల ఎన్టీఆర్ అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది. మరి వారి అంచనాలను త్రివిక్రమ్ అందుకోగలడో లేదో చూడాలి. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జగపతిబాబు, నాగబాబు ఇద్దరు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :