ఎన్టీఆర్ సినిమా కోసం కీలక నిర్ణయం తీసుకున్న త్రివిక్రమ్ !

Published on Jul 25, 2018 9:45 am IST

జూ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రోజు రోజుకు ఈ క్రేజీ కాంబినేషన్‌ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి ఓ పిక్ లీక్ అవడంతో చిత్రబృందం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. మళ్లీ ఇలాంటివి జరగకుండా దర్శకుడు త్రివిక్రమ్ షూటింగ్ స్పాట్ లోకి ఫోన్స్ ను నిషేధించారట, దాంతో పాటు చిత్ర యూనిట్ ని తప్ప ఇంకెవర్ని ఫీల్డ్ లోకి ఎలౌవ్ చేయట్లేదని తెలుస్తోంది.

కాగా ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా ఈ చిత్ర టీజర్ ను ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 15న విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం :