త్రివిక్రమ్ డైలాగ్ మహేష్ విషయంలో నిజమే.!

Published on Oct 18, 2020 4:34 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రెండు సినిమాలు చేసారు. వాటిలో “ఖలేజా” ఒకటి ఇందులో “దైవం మానుష్య రూపేణా” అనే డైలాగ్ ను త్రివిక్రమ్ ఏమనుకొని రాసారో కానీ. ఆ మాటకు ఆ సినిమాలో సీతారామరాజుగా న్యాయం చేసిన మహేష్ నిజ జీవితంలో కూడా అంతే అనిపించుకున్నారు.

మహేష్ కేవలం సినిమాలు చెయ్యడం మాత్రమే కాకుండా తెలియని గొప్ప సాయాలు కూడా ఎన్నో చేసారు. అలా ఎందరో చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించి వారి తల్లిదండ్రుల చిరునవ్వుకు కారణం అయ్యారు. వెయ్యి మందికి పైగా తన సాయంతో ఆయువును అందించిన మహేష్ ఇటీవలే మరో రెండు చిన్నారి ప్రాణాలను కాపాడిన వారయ్యారు.

ఈ విషయాన్ని మహేష్ భార్య నమ్రత తెలియజేసారు. చికిత్స పొందిన ఇద్దరు పిల్లలు డిశ్చార్జ్ కావడం ఆనందంగా ఉందని అందుకు సహకరించిన ఆంధ్రప్రదేశ్ ఆసుపత్రి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాని వారి కుటుంబాలకు తమ ఆశీస్సులు ఉంటాయని అన్నారు.

సంబంధిత సమాచారం :

More